CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అల్పాహారం చెయ్యడానికి ఆగిన నారా లోకేష్..

Share it:

 


స్థానికులతో సెల్ఫీల సందడి..


మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీ పరిధి శివారులో టిడిపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంగళవారం ఉదయం ఖమ్మం టూ కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన తన వాహనాలను ఆపి అల్పాహారం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని నారా లోకేష్ తో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. కానీ..! నారా లోకేష్ ఓపికగా అందరితో తానే స్వయంగా వారి సెల్ ఫోన్ తీసుకొని సెల్ఫీలు తీసి ఇచ్చారు. మాచినేని పేట తండా గ్రామస్తులు కొందరు నారా లోకేష్ ను శాలువాతో సన్మానించారు. అనంతరం అక్కడ నుండి భద్రాచలం వెళుతున్నట్లు తెలిపారు.

Share it:

Post A Comment: