CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధ బాలలకు పండ్లు స్వీట్లు పంపిణీ

Share it:

 



 మన్యంటీవి, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భద్రాచలంలోని అనాధ బాలల ఆశ్రమం లో బాలలకు పండ్లు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సెక్రటరీ కుసుమ మాట్లాడుతూ ఇటీవల చిన్నారి బాలిక ఛైత్ర పై జరిగిన అత్యాచారాన్ని ఖండించారు. పసిబిడ్డ అత్యాచారానికి మరియు హత్యకు పాల్పడిన నిందితున్ని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా అనాధాశ్రమంలో చిన్నారి చైత్ర జ్ఞాపకంగా ఒక మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు భద్రాచలం సెక్రెటరీ లక్ష్మి, పినపాక నియోజకవర్గ ప్రెసిడెంట్ ఇటికలా మాదవి, మణుగూరు ప్రెసిడెంట్ ఎస్కె అరిఫా, అశ్వాపురం సెక్రెటరీ దుర్గ, బూర్గంపహాడ్ స్పోక్ పర్సన్ శారదా మరియు వరలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: