CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామీణ వైద్యులపై అసత్య ప్రచారం సరికాదు...

Share it:

 


-ఆధరలు లేకుండా ఆరోపణలు చేయవద్దు..

-పరిమితికి మించి వైద్యం వైద్యం చేయడం లేదు

-కరోనావంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజలకు ఎనలేని సేవలు

- ఆర్ఎంపీ అసోసియేషన్ మండల అధ్యక్షులు ఎండీ రఫి

కరకగూడెం:

నిరంతరం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఆరోగ్య పరంగా ఆర్ఎంపీలు ఎనలేని సేవలు చేస్తుంటే కొంతమంది చూసి తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని కరకగూడెం మండల ఆర్ఎంపీ  అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే గ్రామీణ వైద్యులు వైద్యం చేస్తున్నారని, కరోనా, మలేరియా,డెంగ్యూ వంటి లక్షణాలతో ఎవరైనా తమ వద్దకు వస్తే ప్రభుత్వ వైద్యాధికారి ప్రతీ సారి సమాచారం ఇచ్చి వారిని అక్కడికి రిఫర్ చేస్తున్నామని అన్నారు.అలాగే గ్రామీణలు మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు వారికి ఇంజెక్షన్స్ రాసి ఇచ్చినప్పుడు వాటిని ఆర్ఎంపీలు సదరు రోగికి చేస్తూ వారికి అండగా ఉంటుంటే ఆర్ఎంపీలపై నిందలా.? అని మండిపడ్డారు.ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉంటున్న ప్రజలకు అర్ధరాత్రి సమయంలో ఎటువంటి ఆపద ఉన్న ఆర్ఎంపీలు వేగంగా స్పందిచి ప్రాణాలను కాపాడుతున్నారని గుర్తుచేశారు.చాలా మంది పేదవారు ఆర్ఎంపీలని తమ ఆపద్బాంధవుళ్లని కొలుస్తుంటె మరి కొంత మంది పనికట్టుకొని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, అన్నారు.మెడికల్ షాపుల వారిని  కూడా ఎంఆర్పీల కంటే  ఎక్కువ ధరలకు మందులు విక్రయిస్తున్నారని అనడంలో అర్ధం లేదని ప్రభుత్వ నిబంధనల మేరకే వారు మందులను విక్రయించి ప్రజల కు అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచి దూరభారాన్ని తగిస్తుంన్నారని ఇందుకు అనేక సాక్షాలు ఉన్నాయని తెలిపారు. రోగులకు అందుబాటులో  ఉంచుతున్నారు అన్నారు.ఇప్పటికైనా ఆర్ఎంపీల పై ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళం చేయొద్దని చూచించారు.

ఈ సమావేశంలో మండల గ్రామీణ వైద్యులు మెడికల్ షాప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: