CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం పరిమళించిన వేళ -ఆపదలో ఉన్న వ్యక్తికి దిశ ప్రొటెక్షన్ బాసట

Share it:

 


- రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సత్తుపల్లి వాసికి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి సపర్యలు

 - స్వయంగా ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించిన వేముల భారతి భర్త ప్రతాప్


 మన్యంటీవి, అశ్వారావుపేట:దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మానవత్వాన్ని చాటుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ పరిధిలోని ఉర్దూ ఘర్ లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ జిల్లా అధ్యక్షురాలిగా అశ్వారావుపేట ఎంపిటీసి వేముల భారతికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగించుకుని కారులో తిరిగి అశ్వారావుపేటలోని స్వగృహానికి బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో సెల్ సిగ్నల్ కూడా అందుబాటులో లేని నిర్మాణుశ్య ప్రాంతంలో సత్తుపల్లికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గమనించిన దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి, అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సాద్ జోత్స్నా  భాయ్, అశ్వారావుపేట మండల అధ్యక్షురాలు ఎండి.రెహీనా, వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీలత, మండల ట్రెజరర్ ఎం. వెంకటమహాలక్ష్మి వెంటనే కారు దిగి ఆ  వ్యక్తికి సపర్యలు చేసి వేముల భారతి భర్త వేముల ప్రతాప్ వేరే కారులో ఎక్కించి సత్తుపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించి దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు. దిశ కమిటీ సభ్యులు చూపిన మానవత్వానికి బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

Post A Comment: