CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల్లో వాటా చెల్లించాలి.

Share it:

 


                                ఐ.ఎఫ్.టి.యు డిమాండ్.


 సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల్లో వాటా చెల్లించాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యం ని డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా మంగళవారం సివిల్ 2, పివి కాలనీ సివిక్ డిపార్ట్ మెంట్ లో సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని, జీవో నెంబర్ 22 ను గెజిట్లో ప్రకటించి పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూపర్వైజర్ అజయ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

             ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తూ సంస్థ లాభాల లో భాగస్వామ్యం అవుతున్నప్పటికీ, సింగరేణి లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా చెల్లించకపోవడం దారుణం అన్నారు. సింగరేణి లాభాలకు కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ ఏ కారణం అనే విషయం మరువరాదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 30% ఫిట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లో కార్మికులకు ప్రకటించి, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ప్రకటించకపోవడం సరైంది కాదన్నారు. జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు పెంచవలసి ఉన్నప్పటికీ, సింగరేణి యాజమాన్యం పెంచడం లేదన్నారు. దీని వలన కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సింగరేణి లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని, జీవో నెంబర్ 22 ను గెజిట్లో ప్రకటించి, వెంటనే పెరిగిన వేతనాలు అమలు చేయాలని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశా రు.

            ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి ఎండీ. గౌస్, నర్సింహారావు, హథీరాం, భీమయ్య, పాపారావు, చారి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: