CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్మిక వర్గాన్ని దెబ్బ తీస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు:

Share it:

 మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు,టేకులపల్లి, ఆళ్ళపల్లి,గుండాల మండలాల విస్తృత సమావేశం ఇల్లందు సీఐటీయూ కార్యాలయం లో జరిగింది.ఇందులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జే రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసే పనినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని అన్నారు.సుప్రీం కోర్టు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని చెప్పినా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని,44కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు గా మార్చి కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. స్కీం వర్కర్ల ను ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తలు ఉంటే వారికి చాలిచాలని గౌరవ పేరుతో వేతనాలు ఇస్తున్నారని అన్నారు. అంగన్వాడి, ఆశ,మధ్యాహ్న భోజన కార్మికులు, డైలీవేజ్, ఐ కే పీ, ఆటో, మోటార్, షాప్ ఎంప్లాయిస్, ఎస్ సీ కాంట్రాక్ట్ కార్మికులు, మిషన్ భగీరద,మున్సిపల్, గ్రామ పంచాయితీ కార్మికులు తదితర రంగాల కార్మికులు హాజ రైనారు. ఈ సమావేశం లో అబ్ధుల్ నబీ, ఆలేటి కిరణ్ కుమార్,సుల్తానా, సంధ్య,ఫాతిమా,మరియా, వీరన్న,మహమూద్,లక్ష్మణ్ పాసి,హైమావతి, కావేరి,సుశీల,ముత్తయ్య,చంద్రకళ,బాలయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...

Share it:

Post A Comment: