CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ కు పోడు సాగుదారుల ప్రతిఘటన తప్పదు : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రాష్ట్రంలో పొడుసాగుదరులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం పెరిగి పోతుందని వేసుకున్న పంటలను కూడా ఫారెస్ట్ అధికారులు నాశనం చేస్తున్నారని ఇదే విధంగా పోడు సాగుదారులపై అరెస్టులు నిర్బందాలు కొనసాగుతే టిఆర్ఎస్ పార్టీకి ప్రతిఘటన తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ హెచ్చరించారు. ఇల్లందు ఏలూరి భవన్ లో సీపీఎం మండల కమిటీ సమావేశం వజ్జ సురేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే సాగుదరుల వద్దకు వచ్చి కుర్చీలో కూర్చొని పట్టాలు ఇస్తానని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ వాగ్దానాన్ని విస్మరించి ఏజెన్సీ లో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పారాని అన్నారు.అటవీ హక్కుల చట్టం ఉన్న గాని దానిని అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తూ పట్టాలు ఉన్న వారి భూములు కూడా లాక్కుంటున్నారని అన్నారు.పొడుసాగుదరుల కు అండగా సీపీఎం నిలబడుతుందని మిగతా రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.అదేవిధంగా ఈ నెల 24 న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఢిల్లీ రైతులకు మద్దతుగా 27 న జరిగే దేశ వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

    ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య,జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజె రమేష్, జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి,సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ,ఆలేటి కిరణ్, వజ్జ సురేష్,మన్నెం మోహన్ రావు,జైబున్నిసా,ఖాదర్ బాబు, ఎస్ వి నర్సయ్య,సంధ్య,సుల్తానా, సర్వన్, మాదరపు వెనటేశ్వర్లు లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: