CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధిని అడ్డుకోవడం, రేగాని ఒంటరి చేయడమే వారి లక్ష్యం

Share it:

 


👉 ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు దోపిడీ జరుగుతున్న కనబడడం లేదా.

👉ఆపవిత్ర పొత్తులు... పసలేని డిమాండ్లు

👉బంద్ లతో కుదేలవుతున్న వ్యాపారవర్గాలు

👉ఇవేమీ పట్టవంటున్న ప్రతిపక్షాలు

👉మీ పాలనలో ఏం సాధించారని సూటి ప్రశ్న?

👉ప్రధాన సమస్యలు విప్ రేగా కాంతారావు పరిష్కరించిన మాట వాస్తవం కాదా!

అభివృద్ధి నిరోధకులుగా మారకండి: పినపాక నియోజకవర్గ వ్యాపార వర్గాలు ,సామాన్య ప్రజానీకం

✍️కొత్త దామోదర్ గౌడ్,వ్యాస కర్త,మన్యం టీవి

మీ పాలనలో పినపాక నియోజకవర్గానికి ఏం చేశారు? అక్కడ ఉన్న పినపాక నియోజకవర్గాన్ని ఉన్నత స్థితికి చేర్చింది విప్, పినపాక శాసనసభ్యులురేగా కాంతారావు అనేది వాస్తవం కాదా!ఆ అభివృద్ధి ఫలాలను అనుభవించిన ప్రజలు మరోమారు అధిక మెజార్టీతో తెలిపిన విషయం ప్రతిపక్షాలకు తెలియదా? ఇది పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాపార వర్గాలు సామాన్య ప్రజలమాట. మణుగూరు డివిజన్ ప్రజల కష్టాలను తెలుసుకుని వారి అవసరాలు తీర్చడం వంద పడకల ఆస్పత్రిని ఎంతో శ్రమకోర్చి రేగా కాంతారావు ముందు చూపుతో తీసుకొచ్చారు. పదే పదే గా ఈ అంశాన్ని లేవనెత్తు ప్రతిపక్షాలు అసలే ని ఆరోపణలతో ఆయన్ను ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాయి. 100 పడుకలఏరియా ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది సిబ్బంది నియామకం కూడా జరిగింది. అయినా కూడా పార్టీలు బంధు పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం. ఇప్పటికే కరోన మూలంగా కుదేలైన వ్యాపారస్తులు అనేకమంది అప్పుల ఊబిలో కూరుకు గా అప్పులు కట్టలేని స్థితిలో మరికొంతమంది వ్యాపారస్తులు సైతం దాఖలు చేశారు. ఏమీ పట్టనట్టు ప్రతిపక్ష పార్టీలు బిజెపి సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ ఇతర పార్టీలు సైద్ధాంతిక పరంగా సిద్ధాంతాలు వేరే అయినప్పటికీ అవన్నీ మరిచి నేడు ఐక్యత రాగం ఆలపిస్తున్నాయి.వీరు చేసే ఈ ప్రయత్నాలను నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. లక్షలు లక్షలు నిరుపేదల దోచుకుంటున్నా ప్రైవేట్ ఆసుపత్రులు వీరికి కనపడటం లేదా అని వీరు తీరు పట్ల నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు కళ్ళు తెరుచుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

Post A Comment: