CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళా సమస్యలపై సమర శంఖం పూరిస్తాం

Share it:

 


 *-మహిళా సాధికరతే  లక్ష్యంగా పనిచేస్తాం

*-దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వేముల భారతి

 *-సిరుల మాగాణి సింగరేణిలో మరో సీతక్క మన భారతక్క


 *మన్యంటీవి, అశ్వారావుపేట:* సిరుల మాగాణి సింగరేణిలో మరో సీతక్కగా మన అశ్వారావుపేట ఎంపిటీసీ వేముల భారతక్క నిలుస్తున్నారని పలువురి వక్తలు కొనియాడారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా వేముల భారతి పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం పట్టణంలోని ఉర్ధూఘర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంజిల్ బత్తిన హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల భారతి మాట్లాడుతూ అడుగడుగునా మహిళలపై ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిపై సమర శంఖం పూరిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే బాలబాలికలకు వారికి కల్పించిన హక్కులు, చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆడవారు వంటింటి కుందేళ్లుగా, అణచి వేయబడుతున్న మహిళలకు దిశ ఫౌండేషన్ అండగా నిలబడుతుందన్నారు, మండలాల కమిటీలను బలోపేతం చేసి దిశ కమిటీ సేవలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంజిల్ బత్తిన మాట్లాడుతూ మహిళలు‌ అన్న రంగాల్లో రాణించాలన్న సంకల్పంతో అణచివేయబడుతున్న ఆడవారికి రక్షణ కల్పించాలన్న ఆశయంతో బి.వీ. రాజు‌ దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించారని ఆయన ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో మహిళల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా గతంలో అధ్యక్షురాలిగా పనిచేసి అకాల మరణం పొందిన మందపల్లి ఉమాకి సభ నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా, నియోజకవర్గం, మండల కమిటీలకు నియామక పత్రాలను వేముల భారతి, ఎంజిల్ బత్తిన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవి లత, పట్టణ అధ్యక్షురాలు లక్మ్షి భాయి, పినపాక, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల ప్రతినిధులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: