CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వచ్ఛ మణుగూరు పట్టణమే లక్ష్యం గా పట్టణ అభివృద్ధి విప్ రేగా

Share it:

 


స్వచ్ఛ మణుగూరు పట్టణమే లక్ష్యం గా పట్టణ అభివృద్ధి విప్ రేగా


మణుగూరు పట్టణంలో తడి,పొడి చెత్త వాహనాల ను ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలో మంగళవారం తడి,పొడి చెత్తను సేకరించే వాహనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు.ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మణుగూరు కు పట్టణ ప్రగతి కి కార్యక్రమంలో భాగంగా రూ.34 లక్షల రూపాయల తో 4 స్వచ్ఛ వాహనాలను చెత్త ను సేకరించే వాహనాలను మంజూరు చేశారు అని,ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతము వేగంగా అభివృద్ధి తో చెందుతున్న ప్రాంతం కావడంతో మున్సిపాలిటీ ప్రజల కోసం,స్వచ్ఛ మణుగూరు పట్టణమే లక్ష్యం గా తడి,పొడి చెత్త వాహనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఇప్పటికే మున్సిపాలిటీ లో చెత్త సేకరించే వాహనాలు, స్వీపింగ్ యంత్రాలను అధునాతన యంత్రాలను ప్రారంభించామని,పట్టణ అభివృద్ధి కి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాక ముందు పరిస్థితులు చాలా ఇబ్బంది గా ఉండేవని,ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.ఏజన్సీ ప్రాంతం ఐనప్పటికీ మణుగూరు కు మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసి,అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు,మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విప్ రేగా కాంతారావు కృషి తోనే పినపాక నియోజకవర్గం లో అభివృద్ధి సాధ్యమవుతుందని,గత పాలకులు ఎవరు చేయని విధంగా మణుగూరు ప్రాంతాన్ని విప్ రేగా అభివృద్ధి చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి పొశం.నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి. నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పార్టీ నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన అధ్యక్షులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: