CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పట్టుబడ్డ గంజాయి ముఠా.....

Share it:

 



భద్రాచలం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ T.స్వామి గారు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు అనగా తేది 17.09.2021 న ఉదయం 08:00 గంటల సమయంలో తన అద్వర్యంలో, ఎస్.ఐ ఎస్. మధు ప్రసాద్, పి.ఎస్ సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, రెండు ఆటోలు 1) TS 04 UB 4940 2) TS 28 TA 2396 మరియు ఒక TVS-XL TS 04 AFTR 9065 అనే వాహనాలలో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా బ్రిడ్జి రోడ్ వైపు వస్తుండగా అట్టి వాహనాలను ఆపి తనిఖీ చేయగా రెండు ఆటోలలో మరియు మోపెడ్ లో నిషేధిత గంజాయి ఉండటాన్ని గుర్తించినారు. అనంతరం వాహనాల్లో ఉన్న ఐదుగురు మగ వ్యక్తులను మరియు ఒక మహిళను విచారించగా వీరు తమ పేర్లను 1. కంపాటి రామారావు R/0 ఇల్లందు 2. చీకటి లక్ష్మి R/0 సారపాక, బూర్గంపహాడ్ 3)కాసుల నవీన్ R/0 మోతె గ్రామం బూర్గంపహాడ్ 4) మూతి స్వామి R/0 ఇల్లందు 5) రేగులగడ్డ రాజేష్ R/0 భద్రాచలం 6) గున్నా బత్తుల శ్యాం సుందర్ @ జాన్ R/0 ఇల్లందు అని చెప్పినారు. వీరందరి వద్ద లభించిన గంజాయి 70 కేజీలు గా ఉండి, దీని విలువ 14 లక్షల రూపాయలు గా ఉండను. వీరు ఈ గంజాయిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము వలస గడ్డ గ్రామం నుండి మహారాష్ట్ర కు తీసుకు వెళ్తున్నారని తెలిపినారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.స్వామి గారు, ఎస్.ఐ, ఎస్. మధు ప్రసాద్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Share it:

Post A Comment: