CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు వాట ప్రకటించాలి ఐ ఎఫ్ టి యు నాయకులు మంగీలాల్

Share it:

 


             

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో సింగరేణి లాభాలలో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యూ నాయకులు మంగీలాల్ సింగరేణి యాజమాన్యాన్ని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు,ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు,ఓబీ వర్కర్లకు, హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,పోస్టుకార్డు ఉద్యమం లో భాగంగా గురువారం సాయంత్రం పివి కాలనీ లోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ కార్మికుల సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణి లాభాలు కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఫలితంగానే, వారి తక్కువ జీతాలు ఫలితంగానే లాభాలు వస్తున్నాయి అని స్వయానా అధికారులే ప్రకటించిన నేపథ్యంలో,మరి సింగరేణి లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు వాటా ప్రకటించరని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనకై సింగరేణి వ్యాప్తంగా ఐ.ఎఫ్.టి.యు చేపట్టిన ముఖ్యమంత్రి కి మా మొర ఆలకించండి అంటూ చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు భాగస్వామ్యం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నువ్వుల. రాజేష్,మోహన్ రావు, నరసింహ,సతీష్,ప్రేమ్ కుమార్,రుక్మిణి,నాగమణి, నీలావతి,లావణ్య,కమల,కొమరమ్మ,లక్ష్మీ ,కోడి రమాదేవి,వి.నాగమణి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: