CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలు

Share it:

 



ముఖ్య అతిథి గా పాల్గొన్న బి.టి.పి.ఎస్ సిఈ పి.బాల రాజు


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి.టి.పి.ఎస్ సీఈ పి.బాల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సభలోని విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటికీ మేము కూడా విద్యార్థులమే అని,30 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశామని, ప్రస్తుతం మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నామని,సీఎం కేసీఆర్ ముందుచూపుతో బి టి.పి.ఎస్ ఏర్పాటుకు గవర్నమెంట్ సంస్థ అయిన బిహెచ్ఇఎల్ తో పూర్తి చేయించాలని,నిర్ణయించారు అని,మణుగూరు, పినపాక ప్రజల సహకారంతో పూర్తి చేశామని చెప్పారు. లైన్స్ క్లబ్ మణుగూరు వారు మంచి టీమ్ గా ఏర్పడి అవసరమైన వారికి సహాయ సహకారాలు చేస్తారని,క్లబ్ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గవర్నమెంట్ కాలేజీ లో మంచి లెక్చరర్స్ ఉంటారని, వారు చెప్పే సబ్జెక్టు మంచిగా అర్థం చేసుకొని చదవాలని, మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని తెలిపారు.విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం లు కమిటెడ్ గా పని చేశారని,అందుకే కీర్తింపబడిన అని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక సవాల్ విసిరారు.ఎంతమంది ఎంసెట్ లో క్వాలిఫై అయితే బి.టి.పి.ఎస్ ఉద్యోగులు అందరూ కలిసి విద్యార్థుల ను చదివిస్తామని చెప్పారు. మిమ్మల్ని చదివించే అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా బి.టి.పి.ఎస్.సిఈ బాలరాజు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరిబాబు కాలేజ్ కు పది ఫ్యాన్ లను ఇస్తామన్నారు. డాక్టర్ సమ్మయ్య 25 కుర్చీలు ఇస్తామన్నారు, చంద్రమోహన్ ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రటరీ పూర్ణ చంద్ర రావు,పి హరిబాబు,చంద్రమోహన్, కృష్ణ మోహన్,చంద్రశేఖర్, ఆర్.నాగేశ్వర రావు, పుల్లయ్య,కాలేజ్ ప్రిన్సిపాల్, వాసవి క్లబ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: