CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉప్పాక దళిత కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

Share it:

 


సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

 మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి


పినపాక మండలం ఉప్పాక గ్రామం దళిత కాలనీలో కనీసం నడవడానికి చిన్న సందు కూడా లేకుండా తాగడానికి మంచినీరు లేకుండా కరెంటు స్తంభాలు లేకుండా అభివృద్ధిలో కూడా అంటరానితనం వివక్ష చూపడం సిగ్గుచేటని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు

 సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు

ఆదివారం ఉప్పాక ఎస్సీ కాలనీలో సమస్యలపై రైతు కూలీ సంఘం కార్యకర్తలతో గద్దల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మోర రవి మాట్లాడుతూ

ఇక్కడి ఎస్సీ కాలనీలో ప్రజలు తమ తాతల కాలం నుండి ఉయ్యాల చెరువు అలుగు కాలువ నుండి నడవడం తప్ప వేరేదారి లేదన్నారు కాలువ నుండి నడవడం ప్రయాసతో కూడిన సమస్యగా మారిందని వారి సొంత స్థలాల నుండి రోడ్డు వేయడానికి కొంత స్థలం కేటాయిస్తామన్నా పట్టించుకున్న నాథుడే లేడని కాలనీవాసులు వాపోతున్నారని తెలిపారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఊరిని ఎస్సీ కాలనీని పోల్చి చూస్తే మనం ఆధునిక యుగంలో ఉన్నామా లేక ప్యూడల్ యుగంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. ఇక్కడ వీధి రోడ్డు లేక నడవడమే కష్టంగా ఉంటే కరెంటు స్తంభాలు తాగడానికి మిషన్ భగీరథ మంచినీటి పైపులైన్లు ఇంటింటికీ నల్ల నీళ్లు వీరికి కలగానే మిగిలిందన్నారు. మండల డెవలప్మెంట్ అధికారులు కానీ గ్రామపంచాయతీ వారు గాని ఎస్సీ కాలనీలో అభివృద్ధి గురించి పట్టించు కోకుండా అంటరానితనం, వివక్ష చూపిస్తున్నారా? అని ప్రశ్నించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా వీధి రోడ్డు నిర్మాణం చేయొచ్చు అనే విషయం అందరికీ తెలుసు కానీ దళితుల అభివృద్ధి గురించి గొంతు చించుకునే వారు ఎవరు ఈ సమస్యలను పట్టించుకోకపోవడం చూస్తే అంటరానితనం పాటిస్తున్నారని అనుమానం రాక మానదు అని అన్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ వారు మండల డెవలప్మెంట్ అధికారులు మానవతావాదులు ముందుకు వచ్చి ఎస్సీ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్దల సమ్మయ్య , గద్దల శంకర్ , గద్దల వినోద్, సాదు స్వరూప, గద్దల నరసమ్మ, గద్దల అంజమ్మ, గద్దల లక్ష్మి , గద్దల నరసయ్య , గద్దల చందు, సాధు శశిముక్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: