CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉హమ్మయ్య నీటి కష్టాలు తీరాయి..

Share it:

 


 *👉వార్డు కౌన్సిలర్ కృషి.. పారిన నీరు.

*👉 జోష్ లో 13వ వార్డు ప్రజలు.

*👉 వన చర్ల విమలకు కృతజ్ఞతలు.

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 10 (మన్యం టీవీ) : గత కొన్ని నెలల నుండి నీళ్ల కోసం కొత్తగూడెం మునిసిపల్ పరిధిలోని13వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని వార్డు మహిళలు కౌన్సిలర్ వన చర్ల విమల దృష్టికి తీసుకురావడంతో ఆమె కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దృష్టికి, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో మంచినీటి సమస్యను తీర్చేందుకు నిధులు మంజూరు అయ్యాయి. అట్టి నిధులతో చేతి పంపు బోరుకు విద్యుత్ మోటార్ ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన మోటార్ ను శుక్రవారం వార్డు కౌన్సిలర్ వన చర్ల విమల ప్రారంభించారు. దీంతో నీటి సమస్య తీరడంతో హమ్మయ్య నీటి కష్టాలు తీరాయి అంటూ వార్డు ప్రజలు అవార్డు కౌన్సిలర్ వన చర్ల విమలకు కృతజ్ఞతలు తెలిపారు. నీటి సమస్యను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ అధికారులకు, టిఆర్ఎస్ నాయకులు  వనమా రాఘవేంద్రరావుకు, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు పోయిన వెంటనే పరిష్కరించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వార్డు కౌన్సిలర్ వన చర్ల విమల పేర్కొన్నారు.

Share it:

Post A Comment: