CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హోమియో డిస్పెన్సరి హాస్పటల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

Share it:

 


హోమియో హాస్పటల్ ను వెంటనే తెరిపించాలి.

తాళం వేసి ఉన్నా హోమియో హాస్పిటల్.

*జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి హాస్పటల్ ను తెరిపించాలి.

*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం లో ఉన్నత అధికారులు ఉన్న హోమియో హాస్పిటల్ గురించి పట్టించుకునే నాధుడు లేడు అని హోమియో హాస్పిటల్ చుట్టూ ముళ్ళ పొదలు పెరిగి హాస్పటల్లో క్రిమి కీటకాలు ఉంటున్నాయని ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలం సీజన్లో ఎక్కువ డెంగ్యూ మలేరియా విషజ్వరాలు కీళ్లనొప్పులు వాతము వీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది నాటువైద్యం పై హోమియోపతి మందుల పై ఆధారపడి ఉన్నారని కానీ హోమియో హాస్పిటల్ గత కొన్ని నెలలుగా తీయడం లేదని మరి ఇక్కడున్న డాక్టర్ బదిలీ అయిన తర్వాత హాస్పిటల్ కు డాక్టర్ ను నియమించక పోవడం తో పాటు ఈ హాస్పటల్ లో పనిచేస్తున్న కాంపౌండర్ కొన్ని నెలల క్రితం రిటైర్మెంట్ కావడంతో అప్పటినుండి ఈ హాస్పిటల్ మూసి ఉంటుందని అన్నారు.కానీ వెంటనే ఉన్నతాధికారులు,జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే హోమియో హాస్పిటల్ ను తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోమియో వైద్యంపై ఏటూర్ నాగారం లో  హోమియో హాస్పిటల్ పై దృష్టిసారించి హాస్పటల్ తెరిపించే విధంగా,డాక్టర్ ఇక్కడే ఉండేవిధంగా,వెంటనే తెరిపించే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,యూత్ మండల అద్యక్షుడు వసంత శ్రీనివాస్,మోతె మల్లేష్,చేల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: