CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉప్పాక ఎస్సీ కాలనీలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి!!

Share it:

 


సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

 మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి

మన్యం టీవి, పినపాక:

పినపాక మండలం ఉప్పాక గ్రామ పంచాయతీ దళిత కాలనీలో మౌలిక సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు సోమవారం ఎస్సీ కాలనీలో వీధిరోడ్డు నిర్మించాలని మిషన్ భగీరథ పైపులైన్ వేయాలని మరుగుదొడ్లు మంజూరు చేయాలని కరెంటు స్తంభాలు వేయాలని ఉప్పాక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం సమస్యలతో కూడిన దరఖాస్తును గ్రామ పంచాయతీ కార్యదర్శికి పినపాక ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మోర రవి మాట్లాడుతూ కనీసం నడవడానికి చిన్న వీధి కూడా లేకుండా మరుగుదొడ్లు తాగడానికి మిషన్ భగీరథ మంచినీరు  కరెంటు స్తంభాలు లేకుండా అభివృద్ధిలో కూడా వివక్ష చూపడం సిగ్గుచేటని అన్నారు ఇక్కడి ఎస్సీ కాలనీలో ప్రజలు తమ తాతల కాలం నుండి ఉయ్యాల చెరువు అలుగు కాలువ నుండి నడవడం తప్ప వేరేదారి లేదన్నారు కాలువ నుండి నడవడం ప్రయాసతో కూడిన సమస్యగా మారిందని  గతంలో ఉన్న రోడ్డు స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించడంతో ఇన్ని ఇక్కట్లకు గురి కావాల్సి వస్తుందని అన్నారు  ఊరిలోనే ప్రజలందరూ తమ పొలాలకు వెళ్లడానికి ఈ దారి తప్ప వేరేదారి లేదన్నారు ఈ రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన ఒక్కవ్యక్తి నీ కొందరు అడ్డం పెట్టుకొని సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా గ్రామపంచాయతీ వారు మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు స్పందించి ఎస్సీ కాలనీ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెబుతుంటే గ్రామ పంచాయతీలలో  మాత్రం వీధిరోడ్లు మురుగునీటి గుంటలు రోడ్లు బురదమయంగా దర్శనమిస్తున్నాయని అన్నారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు మనం ఆధునిక యుగంలో ఉన్నామా లేక ప్యూడల్ యుగంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. దళితుల అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఇప్పటికైనా  ఎస్సీ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారం కాని యెడల అఖిలపక్ష పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో   గద్దల సమ్మయ్య , గద్దల శంకర్ , గద్దల వినోద్, సాదు స్వరూప, గద్దల నరసమ్మ, గద్దల అంజమ్మ, గద్దల లక్ష్మి , గద్దల నరసయ్య , గద్దల చందు, సాధు శశిముక్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: