CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉తల్లిదండ్రులు విద్యార్థులను బడికి పంపాలి!

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2 (మన్యం టీవీ)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం, నిమ్మలగూడెం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివకుమార్

కోవిడ్ ఉద్ధృతి తగ్గిన ఈ పరిస్థితిలో ప్రత్యక్ష బోధనకు పాఠశాలలు సిద్ధమై నందున పాఠశాలలో పకడ్బందీగా కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని

ప్రతి ఒక్క విద్యార్థి మాస్కు తప్పనిసరిగా ధరించి రావాలని విద్యార్థులందరికీ పాఠశాలలో శానిటేషన్ చేస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చో పెడుతున్నామని పాఠశాల తరగతి గదులు మరుగుదొడ్లను ప్రాంగణమంతా కూడా పరిశుభ్ర పరిచామని కావున తల్లిదండ్రులు కోవిడ్ అపోహలు వీడి విశ్వసనీయతతో పిల్లలను బడులకు పంపించాలని

నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివ కుమార్ తెలియజేశారు. గురువారం నాడు నిమ్మలగూడెంలో ని గృహాలను దర్శించి తల్లిదండ్రులను కలిసి పిల్లలందర్నీ బడికి పంపించాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ పై ఉన్నటువంటి అపోహలను తొలగించి డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ లాంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారిని కోరారు. గ్రామ సర్పంచ్ బండి రమేష్ ని పాఠశాలకు పిలిపించి పాఠశాల పరిస్థితుల గురించి మధ్యాహ్న భోజనం గురించి వారితో చర్చించారు.పాఠశాల నిర్వహణను స్థితిగతులను పాఠశాల పరిశుభ్రత కోవిడ్ నిబంధనలను సక్రమంగా అమలు పరచుట విద్యార్థుల ప్రమాణాల పట్ల గ్రామ సర్పంచ్ బండి రమేష్ సంతృప్తిని ఆనందాన్ని వ్యక్తపరచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివకుమార్ ను అభినందించారు. గురువారం నాడు విద్యార్థుల హాజరు ను పాఠశాల రిపోర్ట్ నంతటిని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మేరుగు శ్రీనివాస్ కి మరియు నోడల్ అధికారి కుసుమ శ్రీనివాస్ కి ప్రధానోపాధ్యాయులు మద్దెల శివకుమార్ తెలియపరిచారు.

Share it:

Post A Comment: