CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిబంధనల మేరకు నిర్వహించాలి

Share it:

 


*వర్షాకాలంలో వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. *డీజే ల కు అనుమతి లేదు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఏటూర్ నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్.

         మన్యం టీవీ ఏటూర్ నాగారం

గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఏటూర్ నాగారం ఏఎస్ పి ఆలం గౌస్ ఐపీఎస్ అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలో సీఐ సట్ల కిరణ్ కుమార్ అధ్యక్షతన బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు పోలీసు వారి విజ్ఞప్తి మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ విష వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త ఉంటూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి అన్నారు.వరద నీరు పొంగి రోడ్లపై కలవట్లా పై ప్రవేశిస్తున్నప్పుడు వాటిని దాటడానికి ప్రజలు సాహసాలు చేయకూడదు అన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రవహిస్తున్న వాగు దాటుతున్న క్రమంలో ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామం లో జంపన్న వాగు వద్ద,మంగపేట గోదావరి వద్ద ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందిన చెందినట్లు అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అత్యవసర సమయంలో పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 100 కి ఫోన్ చేయాలి అన్నారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను గోడలను తాగకూడదని అవి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. ఇనుప జి వైర్లపై గృహిణిలు బట్టలు ఆరబెట్టడం చేయకూడదు అన్నారు.ఇంటి పై కప్పు గా వేసిన రేకులను తాకకూడదు అన్నారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉండకండి అవి ఊహించని విధంగా కూలీపై ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని వర్షాకాలంలో మీ ఇంటి ఆవరణలో మీరు విలువ లేకుండా చూసుకోండి నిరుపయోగంగా పడి వేసిన పాత్రలలో ప్లాస్టిక్ డబ్బాలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.వీటి వలన దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాల బారిన పడి మృతి చెందే ప్రమాదం ఉందన్నారు. వాటర్ డ్యాం లో వాటర్ హౌస్ లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. పిడుగులు పడుతున్నప్పుడు గాలిదుమారం వేస్తున్నప్పుడు ప్రజలు రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్నారు.పిడుగులు పడుతున్న సందర్భంలో సెల్ ఫోన్స్ ఉపయోగించకూడదని తెలిపారు.రైతులు వ్యవసాయ బోర్ల వద్ద కరెంట్ పెట్టేముందు స్టార్టర్ బాక్స్ లను చేతులతో ముట్టుకోకూడదు.వరద నీటికి చెరువులు కుంటలు నిండి చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంటుంది.కావున ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.చిన్నపిల్లలు ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి నదిలోకి చెరువుల లోకి వెళ్లడం చేపలు పట్టడం లాంటివి చేయకూడదు అన్నారు.వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి వాహనదారులకు కనిపించాక ప్రమాదానికి గురై ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.కావున జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకొని ప్రయాణం చేయాలన్నారు. వరదల వలన డ్రైనేజీ కాలువలు మ్యాన్హోల్స్ వాటికవే తెరవబడి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ప్రయత్నించాలన్నారు.రోడ్లపై దీని వలన డ్రైనేజీ లోకి చేరి ప్రవాహం సంభవించి రోడ్లపైకి ఇళ్లలోకి డ్రైనేజీ దుర్గందం వ్యాపించి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అన్నారు.ప్రజల రక్షణ తమ బాధ్యత అని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో నిబంధనలు పాటించాలి.డీజే లకు అనుమతి లేదు.గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎవరు కూడా డీజే లు ఏర్పాటు చేయకూడదు డీజే లకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.గణేష్ మండపాల నిర్వాహకులు వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమర్పించాలన్నారు. ములుగు భూపాలపల్లి జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు మండల కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమర్పించాలని తెలిపారు. గణేష్ మండపాల వద్ద నిమజ్జనం శోభయాత్ర లో డీజే లకు ఎలాంటి అనుమతి లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు.గణేష్ నవరాత్రులు నిర్వహించే సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. మండపాల నిర్వాహకులుhttp://policeportal.ts.gov.in వెబ్ సైట్ ద్వారా వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు వాటిని పరిశీలించి గణేష్ మండపాలు ఏర్పాటుతోపాటు నిమజ్జన అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: