CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బీజేపి నాయకులు పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేయాలి

Share it:

 


కార్యకర్తల కష్టసుఖాలలో పాలుపంచుకొని పార్టీ బీ జే పి


గత పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ,  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మంత్రి సత్యవతి రాథోడ్


ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడితే అధికారం రాదు

ప్రజల మనసు గెలుచుకుంటేనే అధికారం


కార్యకర్తలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్


టిఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు


టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు


అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ టిఆర్ఎస్ ప్రభుత్వమే


పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.


మన్యం మనుగడ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య లు అక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ, అనేకమందికి సభ్యత్వ భీమా సదుపాయాన్ని కల్పించింది అని, ఏడు సంవత్సరాలు పరిపాలన సాగించిన బిజెపి ప్రభుత్వం కార్యకర్తల పై కనీసం, కనికరం చూపించడం లేదని, రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని, ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి ప్రభుత్వం, తెలంగాణలో అభివృద్ధి కోసం పాదయాత్రలు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని, మోకాళ్ళ యాత్రలు చేసిన భారత ప్రజానీకానికి బీజేపీ చేసిన పాపం ఎప్పటికీ పోదని, అభివృద్ధి పేరుతో 450 రూపాయల గ్యాస్ సిలిండర్ ను తొమ్మిది వందల రూపాయలకు పెంచి సగటు జీవి జీవితాన్ని అతలా కుతులం చేసిందని ఎద్దేవా చేశారు.

ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడితే అధికారంలోకి రారని, తెలంగాణ ప్రజల మనసు గెలుచుకుంటేనే అధికారం వస్తుందని, కెసిఆర్ ను చూసి  ఇది నేర్చుకోవాలని తెలియజేయడం జరిగింది. అయినా అలాంటి మొనగాళ్లు ఇంకా పుట్టలేదని, కలలో ఊహించుకొని బయట పనికి రాని మాటలు మాట్లాడే వ్యక్తి కొత్త పదవి రాగానే ఎగిసి ఎగిసి పడుతున్నాడని, ఈ విషయం పరంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి కోసం కేసీఆర్ ఆరాట పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల లాంటివి అని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన  ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, మినీ అంగన్వాడీ కేంద్రాలు అనేవి లేకుండా చేయడం కోసమే అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని, పోడు భూమి కోసం పోరాడే యోధుడు, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక్కడే అని, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా, ఇది త్వరలోనే సాధ్యమవుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  మండల ఎంపీపీ రేగా కాళిక, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: