CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యాక్సినేషన్ పై విస్తృత పర్యటన చేసిన ఎంపీపీ

Share it:

 



  18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేపించుకోవాలి -ఎంపీపీ


మండలంలో విస్తృత పర్యటనా చేసిన ఎంపీపీ


కొత్త ఆలోచనలతో వ్యాక్సిన్ పై అవగాహన చేస్తున్న ఎంపీపీ


మన్యంటీవి, అశ్వరావుపేట: అశ్వారావుపేట మండలం లోని పలు గ్రామాలలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి విస్తృత పర్యటన చేశారు. మండలంలోని కావిడిగుండ్ల, కన్నాయి గూడెం, గొపన్నగూడెం, గోగులపుడి, పండువారి గూడెం, వినాయకపురం, అశ్వారావుపేట గ్రామాలలో విస్తృత స్థాయి లో పర్యటనా చేశారు. గ్రామాలలో వేసే వ్యాక్సిన్ వేసే కేంద్రాలను పరిశీలించారు. వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని,18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేపించుకోవలని, గ్రామాలలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని గ్రామలలో వున్న ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ ఒక్క వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేపించుకునెల కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే గ్రామాలలో వున్న పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేపించుకుంటే ఏ విధమైన ఉపయోగం వుంటుందో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రజలు కూడా దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నా గర్భిణీలు, అవినా సుగర్, బిపి, గ్యాస్ ఇటువంటి ఏ వ్యాధులు ఉన్నా సరే భయపడకుండా తప్పని సరిగా వ్యాక్సిన్ వేపించు కోవాలని మండల ప్రజలను ఎంపీపీ జల్లి పల్లి శ్రీరామమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీడీఓ విద్యాధర రావు, ఈసీ రామచంద్రరావు, ఆయా గ్రామ ఎంపిటిసి లు, సర్పంచ్ లు, కార్యదర్శులు, వార్డు మెంబర్ లు, ఆశ వర్కర్లు, ఎయెన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: