CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సింగరేణి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ డిమాండ్.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 13 (మన్యం టీవీ) నూతనంగా ఏర్పడ్డ తెలంగాణలో సింగరేణి డిస్మిస్ కార్మికులకు వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద ఉద్యోగలిస్తాన్న కెసిఆర్ మాటతప్పి డిస్మిస్ కార్మికులను మోసం చేసారని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోల్ బెల్ట్ ఏరియా లోని ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఇచ్చిన వాగ్దానం గాలికి వదిలేసి డిస్మిస్ కార్మికుల సమస్య పట్ల స్పందించడం లేదని, తెలంగాణలో ఓట్ల,నోట్ల రాజకీయాలు తప్ప సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. హుజురాబాద్ లో ఎన్నికలు ఉన్నాయనే దళిత బంధు పేరుతో మరొక్కసారి దళితులను మోసం చేయడానికి చూస్తున్నారని సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికులకు ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు అందడం లేదని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో బహుజనుల బ్రతుకులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికులలో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలే ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ డిస్మిస్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంది తిరుపతి, ప్రధాన కార్యదర్శి చెనిగారపు నారాయణ, కార్యదర్శి పోలు మధు,సంగం ఎల్లయ్య, ఇలారి.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: