CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామాలలో రెపరెపలాడిన గులాబీ జెండా

Share it:

 



ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్నవారు సైతం దగ్గరగా


గులాబీ దళంలో వెల్లివిరిసిన అభిమానం


మన్యం మనుగడ, పినపాక: 


దేశ రాజధాని ఢిల్లీలో శంకుస్థాపన చేసిన తెలంగాణ భవన్ కు సంబంధించి, తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వ్యాప్తంగా గల 23 పంచాయతీలలో జెండా పండుగ ను, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పినపాక మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పెద్ద మొత్తంలో లో తెలంగాణ పార్టీ అభిమానగణం హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఏడూళ్ళ బయ్యారం, పినపాక, పాండురంగాపురం, వెంకట రావు పేట, సింగిరెడ్డి పల్లి, జానంపేట, దుగినే పల్లి, ఇతర పంచాయతీలో, గ్రామ అధ్యక్షుని ఆధ్వర్యంలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తలు జై కేసీఆర్ ఆర్ జై కేటీఆర్ ఆర్ జై రేగా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. పండగ వాతావరణాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేసిన అభిమానులకు, కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో లో మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త దృఢనిశ్చయంతో పనిచేయాలని మండలానికి చెందిన పలువురు టిఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది.ఇప్పటి వరకు కొన్ని అనివార్య కారణాల వలన దూరంగా ఉన్న, కొంతమంది అభిమానులు సైతం టిఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల, జెండా పండుగ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ ఇన్చార్జి లు, పార్టీ అభిమానులు, యువకులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: