CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు పూలతో ఘనంగా స్వాగతం పలికిన జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:

 


మన్యం టీవి, బూర్గంపాడు:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రత్యక్ష బోధన తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు మొరంపల్లి బంజర్ లో మరియు బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరియు అంగనివాడి కేంద్రంలో చదువుకొనే విద్యార్థి,విద్యార్థినిలకు పూలతో ఘనంగా స్వాగతం పలికి చాక్లెట్లు,బిస్కెట్లు పంచిన ముఖ్య అతిధి బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.

అనంతరం విద్యార్థి,విద్యార్థినిలకు పలకలు,పుస్తకాలు పంపిణీ చేశారు.జడ్పీటీసీ శ్రీలత గారు విద్యార్థి,విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా దాదాపు 16 నెలల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు ఈ రోజు పునః ప్రారంభం అయ్యాయని, పాఠశాలలను అధికారులు శుభ్రం చేయించారని.విద్యార్థులు సంతోషంగా,నిర్భయంగా పాఠశాలలకు రావాలని.విద్యార్థుల తల్లిదండ్రులకు నా అభినందనలు అని తెలిపారు. కావున విద్యార్థులందరు పాఠశాలకు హాజరై మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థులకు జ్వర సూచన ఉంటే అయా ప్రధానోపాధ్యాయులు,ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జడ్పీటీసీ గారు సూచించారు.ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు.తరగతులకు హాజరయ్యే విద్యార్థులు శానిటేషన్ చేసుకోవడం,మాస్కులు విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలన్నారు.పారిశుద్ధ్యం బాధ్యత అయా గ్రామ పంచాయతీ సర్పంచులదే అని సూచించారు.అదే విధంగా ఉపాధ్యాయులు అందరూ వంద శాతం హాజరవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు భూక్య దివ్యశ్రీ గారు,సిరిపురపు స్వప్న గారు,ఎంపీడీఓ వివేక్ రామ్ గారు,తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి గారు,హైస్కూలు ప్రధానోపాధ్యాయులు కె.వెంకటేశ్వర్లు గారు,స్థానిక ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి గారు,స్థానిక టిఆర్ఎస్ నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి గారు,గాదె నర్సిరెడ్డి గారు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు కైపు ఖగేందర్ రెడ్డి గారు,స్థానిక పంచాయతీ సెక్రటరీ సాయి గారు,ఉపాధ్యాయులు తేజవత్ మోహన్ గారు మరియు ఉన్నత,ప్రాథమిక పాఠశాలల ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులు,అంగనివాడి కేంద్రం ఆశ వర్కర్లు,ANMలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: