CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెడ్డిగూడెం ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు?

Share it:

 


 *అక్రమాలు నిలదీసినందుకు దాడి

 *పోలీసులకు ఫిర్యాదు


 మన్యంటీవి, అశ్వరావుపేట: అశ్వారావుపేట మండలం లో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నించినందుకు ఉపాధి కూలీ పై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామపంచాయతీలో జూలై ఆగస్టు నెలల్లో ఉపాధి హామీ పనులు నిర్వహించారు. ఈ పనుల్లో ఉపాధి కూలీల హాజరు వేసే మేట్ మరియు అధికారులు కలసి పని చేసిన వారికి మస్టర్లు వేయకుండా ఉపాధి కూలీకి రాని వారికి అధిక మస్టర్లు వేసి అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ కూలీలు, మేట్, గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీల మస్టర్లు పరిశీలించగా హాజరు వేసే మేట్, అధికారులు కలిసి మస్టర్లు తారుమారు చేశారని అర్ధమవుతుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మస్టర్లు తారుమారు చేసి పని చేయని వారి పేరుతో అధిక మస్టర్లు వేసిన మేట్ మరికొంతమంది కలసి బాబురావు అనే ఉపాధి కూలీపై దాడిచేసి కొట్టారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఉపాధి హామీ మస్టర్ లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి పని చేసిన వారికి మస్టర్లు ఇప్పించాలని, ఉపాధి కూలీ పై దాడి చేసిన మేట్ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share it:

Post A Comment: