CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జెండా పండుగను విజయవంతం చేయాలి:జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:

 


మన్యం టీవి, బూర్గంపాడు:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్&మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు గౌ"శ్రీ రేగా కాంతారావు ఆదేశానుసారం రేపు అనగా 02-09-2021న టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి,పార్టీ కార్యక్రమాలు ప్రారంభించి,ప్రతి ఒక్కరు ఈ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు కోరారు.ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ సాహసించని,కనీవినీ ఎరుగని రీతిలో పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న తెరాస అధినేత,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారన్నారు.తమ ఆత్మగౌరవాన్ని వినువిధుల రెపరెపలాడించిన గులాబీ జెండాకు 60 లక్షలకు పైగా టిఆర్ఎస్ సైన్యం పండుగ చేస్తుందన్నారు.సెప్టెంబర్ 2న తలపెట్టిన జెండా పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి విజయవంతం చేయాలని కోరారు.

Share it:

Post A Comment: