CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారుల పోరు గర్జన🔥✊🔥✊🔥✊🔥✊✊

Share it:

 


【కొమరం భీమ్, భగత్ సింగ్ ల ఉద్యమ స్పూర్తితో పోడు భూములను కాపాడుకుంటాం...】

★అఖిల పక్ష పార్టీల సమావేశంలో ప్రసంగించిన కూనంనేని సాంబశివరావు★

మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం(సెప్టెంబర్-28):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి లో నిర్వహించిన పోడు సాగు దారుల సమావేశంలో సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ

ఆదివాసీ బిడ్డల కు అడవితో ఉన్న బంధం తల్లి లాంటి అనుబంధం అని. అడివిలో పుట్టిపెరిగి చెట్టు,పుట్టను నమ్ముకొని జీవిస్తూ... పొడు భూమినే నమ్ముకొని, గత నూరేళ్లుగా పొడు వ్వవసాయం చేసుకుంటూ ఆదివాసీలు జీవిస్తున్నారని. కల్వకుంట్ల చంద్రశేఖర రావు బంగారు తెలంగాణా సాధిస్తా అని ప్రగల్భాలు పలికి, ముఖ్యమంత్రి అయ్యాక నిరు పేద ఆదివాసి గిరిజనులు పై దాడులు చేపిస్తున్నారని. ప్రతి పేదవాడికి 3 ఎకరాలు భూమి ఇస్తా అని, ఇచ్చిన హామీ తుంగలో తొక్కి, తెలంగాణ రాష్ట్రం లో నేటి వరకు పేదలు, ఆదివాసీలు సాగు చేస్తున్న సుమారు 5 లక్షల ఎకరాల్లో హరితహారం పేరుతో పంట భూములు లాక్కుని మొక్కలు నాటారని, కూనంనేని సాంబశివరావు ఆరోపించారు... తెలంగాణ లో ఆదివాసీ బిడ్డలు జోలికి వస్తే, అడివి బిడ్డలు సాక్షిగా తిరుగుబాటు ఎర్ర జెండా ఎగర వేస్తాం అని హెచ్చరించారు. అక్టోబర్ 5 న అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి అంగుళం కూడా వదలకుండా పొడు సాగుదారులతో రోడ్డు పైకి వచ్చి ఉద్యమం ఉవ్వెత్తున చేపడతామని, కేసీఆర్ పథనం ఆ ఉద్యమం ద్వారా ఆములు కానున్నదని. అల్లూరి సీతారామరాజు.,కొమరం బీమ్, భగత్ సింగ్ ఉద్యమం స్ఫూర్తి తో ఆత్మ రక్షణ కోసం సంప్రదాయ బాణాలు,విల్లంబులు చేత పట్టి భూములు పరిరక్షించుకుంటామని. చరిత్రలోనే ఎంతో మంది పాలకులైన హిట్లర్, బ్రిటిష్, నైజాం పాలకులను ప్రారదోలిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకు ఉందని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్,ఎస్డి సలీం, భాస్కర్ రావు,రామకృష్ణ,

సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శనమ్,సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,కే పుల్లయ్య,మచ్చ వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సున్నం నాగమణి, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: