CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యం విడాలి. కోర్టు ఆదేశాలను గౌరవించాలి.

Share it:

 


 👉 త్వరలో ఆదివాసీ సేన అడ్వకేట్ అసోసియేషన్ ఏర్పాటు

👉 హైకోర్టు న్యాయవాది,ఆదివాసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు సోడె వెంకటేశ్వర్లు

మన్యం టీవీ:ములకలపల్లి ప్రతినిధి:

షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసుల రక్షణ, మనుగడ కోసం ఉన్నటువంటి ఎల్.టి.ఆర్, పేసా,ఆర్.ఒ.ఎఫ్.ఆర్,ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టాలను అమలు చేయుటలో అధికారులు నిర్లక్ష్యం వీడి గ్రామసభ తీర్మానాలను,కోర్టు ఆదేశాలను పాటిస్తూ ఆదివాసీలకు హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా సహకరించాలని,హైకోర్టు న్యాయవాది ఆదివాసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు సోడే వెంకటేశ్వర్లు కోరారు.

 గుట్టగూడెం గ్రామంలో ఏర్పాటుచేనా సమావేశం లో.ముఖ్య అతిధిగా విచ్చేసి మండల అధ్యక్షులు దుబ్బా భాస్కర్ ప్రసంగిస్తూ ఆదివాసీల కోసం పలు స్థాయిలో న్యాయ సహాయం అందించడానికి అధివాసి సేన అడ్వాకెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఆదివాసీల వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ఎద్దులను, అందించడంతో పాటు,మేలైనా వ్యవసాయ పద్ధతులు అవలంబించడానికి వ్యవసాయ శాఖ,గిరిజన శాఖ అధికారులు చేయుతనివ్వాలని,ఆదివాసీలపై జరిగే దాడులను ఐక్యంగా తిప్పికొట్టుటకు అందరూ ఏకం కావాలని,మన హక్కులు కాపడుటకు ఐక్యపోరాటాలే శేరణ్యం అని, గ్రామసభ తీర్మానాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని,న్యాయ సహాయం కొరకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన భద్రాద్రి జిల్లా కన్వీనర్ ఊకె రవి,కొమరం అనిల్ కుమార్,వజ్జ జ్యోతిబసు,సోడే శ్రీను,కారం వెంకటేష్,పెనుబల్లి సూర్యం,సడియం లక్ష్మీ,కేసరి నగేష్,సడియం వీరభద్రం,శ్యామ్ బాబు,వెంకటలక్ష్మి,పొట్ట రాములు,రాఘవమ్మా,అక్కమ్మ,

కృష్ణవేణి,బోడమ్మ,కొర్రీ లక్ష్మీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: