CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమి స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి

Share it:

 


ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యం లో డి.జి.ఎం పర్సనల్  రమేష్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు


మన్యం టీవీ మణుగూరు: సింగరేణి కాలరీస్, మణుగూరు ఏరియా పీకే ఓసి,మణుగూరు ఓసీలలో భారీ యంత్రాల ట్రాక్ క్లీనింగ్ మరియు ఇతర నిర్వహణ పనులలో హెల్పర్లు గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక డి.జి.ఎం. పర్సనల్ రమేష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు అనుబంధ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్డీ.నాసర్ పాషా మాట్లాడుతూ పీకే ఓసి లో 30 మస్టర్ లకు గాను 40 మంది,మణుగూరు ఓసి లో 12 మాస్టర్ లకు గాను 18 మంది,మొత్తం ఒక్క మణుగూరు ఏరియా లో నే సుమారు 60 మంది వరకు భారీ భూ చరిత యంత్రాలు అయిన షావెల్స్, డోజర్స్, డ్రిల్స్ నిర్వహణ సమయంలో ట్రాక్ క్లీనింగ్ మరియు ఇతర నిర్వహణ, మరమ్మత్తు పనులలో సింగరేణి యాజమాన్యానికి ఇతోధిక తోడ్పాటు అందిస్తున్నారనీ కానీ, నైపుణ్యత లేని కార్మికులు గానే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారనీ,అదేవిధంగా పర్చేజ్ విభాగం టెండర్, కావడంతో బిల్లుల ప్రక్రియ లో కూడా జాప్యం కారణంగా  కాంట్రాక్టర్లు వీరికి వేతనాలు కూడా ఆలస్యంగా బ్యాంకు లో జమ చేస్తున్నారన్నారు. మణుగూరు ఓసీలో అయితే ఈసమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఈ క్రింది సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతి నెల 7వ తేదీలోగా వీరి బ్యాంక్ ఖాతాలలో వేతనాలు జమ చేయాలి అని,ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ సింగరేణిలో ఉచిత వైద్యాన్ని కై మెడికల్ అటెండెన్స్ బుక్కులు ఇవ్వాలి అని,షూ,హెల్మెట్  యూనిఫామ్ ఇతర రక్షణ పరికరాలు సింగరేణి యాజమాన్యమే ఉచితంగా అందజేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి. యు నాయకులు నల్లా. రమేష్,ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మిట్టపల్లి. ఉప్పయ్య,పి.డేగల.రాజేంద్ర బాబు,ఎం.రాజు,ఆర్.జనార్ధన్,జి.రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: