CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పాఠశాలలు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది

Share it:

 


👉విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి జిల్లా కలెక్టర్ అనుదీప్.

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబరు 1, (మన్యం టీవీ) బుధవారం సుజాతనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. దాదాపు 16 నెలలు తదుపరి పాఠశాలలు ప్రారంభమయ్యాయని, పాఠశాలల ఆవరణలు మొత్తం పరిశుభ్రం చేయడంలో కీలకపాత్ర పోషించిన పంచాయతీ, మున్సిపల్ సిబ్బందిని ఆయన అభినందించారు. పాఠశాలకు హజరైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 6 నుండి 10వ తరగతి ఉన్న ఈ పాఠశాలలో 431 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, 19 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చాలా రోజులు తదుపరి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు బేసిక్స్ నుండి ప్రారంభించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులతో కొద్దిసేపు ముచ్చటించిన కలెక్టర్ మంచిగా చదువుకోవాలని, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని విద్య యొక్క ప్రాధాన్యతను వివరించారు. పాఠశాలు ప్రారంభం కావడం ఎలా ఉందని, ఏమైనా ఇబ్బందులున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాధి వల్ల పాఠశాలలు నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో ఇన్ని రోజులు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేశామని, ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్ధులు కలెక్టర్ వివరించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, విధిగా మాస్కు ధరించడం, విద్యార్థులు సామాజిక దూరం పాటించడం, వ్యక్తి గత పరిశుభ్రత, చేతులు సబ్బుతో కానీ, సానిటైజర్తో కానీ పరిశుభ్రం చేసుకోవాలని, జాగ్రత్తలు పాటింపే శ్రీరామరక్షని చెప్పారు. పాఠశాల ప్రహరి నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల మైదానంలోకి పశువులు రాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఆవరణలోకి వచ్చే పశువుల యజమానులకు జరిమాన విధించాలని చెప్పారు. విద్యార్థులు ఆడుకోవాలి కానీ పశువుల కొరకు కాదని కఠిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శిని ఆదేశించారు. పాఠశాలకు సువిశాలమైన క్రీడా మైదానం ఉన్నందున విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యాలను నేర్పించాలని చెప్పారు. ఆటలు వల్ల విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా మంచి పరిపుష్టి వస్తుందని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. వంటకు కట్టెలు వినియోగించకుండా గ్యాస్ ద్వారా వంట చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో గ్యాస్ సౌకర్యం లేని పాఠశాలల వివరాలు అందచేయాలని డిఈఓను ఆదేశించారు. కట్టెల వల్ల వచ్చే పొగతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన తయారికి గ్యాస్ సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే వారం వరకు పాఠశాలకు మిషన్ బగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో యంపిపి విజలక్ష్మి, తహసిల్దార్ సునీల్ రెడ్డి, యంపిడిఓ వెంకటలక్ష్మి, యంపిఓ, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: