CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బందును రాష్ట్రమంతటా అమలు చేయాలి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం  మండలంలో శుక్రవారం  ఏటూరు,సింగారం గ్రామలలో జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క మరియు  ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కన్నాయిగూడెం మండలం ఇంచార్జి ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ప్రకటించారు ఈ దళిత బంధు ఒక్క హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రం అంతటా అమలు చేయాలని  దళిత బంధు 10 లక్షల రూపాయలకు పన్ను మినహాయింపు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు  తెలియజేశారు.దళిత గిరిజనుల పైన దాడులు చేస్తున్న ఈ దొంగ ప్రభుత్వాలకు త్వరలోనే ప్రజలు బుద్ది చెప్తారని గత 30 సంవత్సరాలుగా ఆదివాసి గిరిజనులు దళితులు  దున్నుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసిఆర్ మాట నిలబెట్టుకొలెదని తెరాస నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. దళితబంధు రాష్ట్రమంతటా ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమములో వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్,ఉప సర్పంచ్ గడ్డం నగేష్,ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్ కుమార్,కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షులు అబ్బు రమేష్ జిల్లా నాయకులు జాడి రాంబాబు,మరికాల వెంకట్, కంతనపల్లి సర్పంచ్ చింత నరసక్క చంద్రయ్య,బీసీ సెల్ మండల అధ్యక్షులు కటకం మల్లన్న,కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటి రాజబాబు, యూత్ మండల అధ్యక్షులు బోట నగేష్,మంగపేట మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,ఏటూరు, బుట్టాయిగూడెం,కొత్తూరు గ్రామ కమిటీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రసిడెంట్ లు, సునార్కని శ్రీరాములు,పల్లా లచ్చబాబు,నవీన్,చంటి, ఎల్లయ్య కొక్కరెక్కల చిరంజీవి, చిన్నాన్న, తదితరులు  పాల్గొన్నారు.

Share it:

Post A Comment: