CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం పరిమళించిన వేళా

Share it:

 



కొప్పుల గణపతి కి సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్ బృందం రూ.14 వేల రూపాయల ఆర్ధిక సహాయం


మన్యం టీవీ మణుగూరు:

భద్రాచలం కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం సీతానగరం ఎస్సీ కాలనీకి చెందిన కొప్పుల గణపతి గత కొంత కాలంగా వెన్నుపూస దెబ్బతినడంతో మంచానికే పరిమితమై,లేవలేని స్థితిలో ఉన్న ఆయన ఆయన కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన *సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్ బృందం* బుధవారం మణుగూరు పీకే ఓసి టు బేస్ వర్క్ షాప్ డంపర్ మెయింటెన్ సెక్షన్ నందు రూ. 14 వేల రూపాయలను వర్క్ షాప్ ఇన్చార్జి రాజశేఖర్, టిబిజీకేఎస్ ఉపాధ్యక్షులు వి. ప్రభాకర్ రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అబ్దుల్.రవూఫ్ సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్ సభ్యులు,లింగాల నవీన్, సూర్య తేజ,చటర్జీ,ఉపేందర్, నరేష్,జి శ్రీనివాస్ సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్,ప్రభాకర్ రావు గార్లు మాట్లాడుతూ,సాటివారికి సాయం చేయడంలో మన వర్క్ షాప్ ముందుంటుందని, మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ వితరణ కార్యక్రమం లో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు,సి హెచ్ అశోక్, రాజేశ్వరరావు,జగదీష్,సత్యనారాయణ,శివ రావు,జీవరత్నం, అన్వర్ భాష,తాజుద్దీన్, రాజమౌళి,అంజద్, ఫోర్ మెన్ ఇమాన్యుల్ రాము ఎం శ్రీనివాస్,ఎస్ టి శ్రీనివాస్,బి శ్రీనివాస్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: