CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్రతికి వున్నా చనిపోయినట్లు నిర్ధారణ... అదే కారణంతో ఏడు నెలలనుండి పెంక్షన్ నిలిపివేత ఎంతమంది చుట్టూ తిరుగుతున్న కనీసం అధికారిని కలవడానికి నిరాకరణ

Share it:

 



 *మన్యంటీవీ, అశ్వారావుపేట:* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీ దొంతికుంట కు చెందిన ముళ్ళగిరి మంగమ్మ  భర్త పిచ్చయ్య వయసు 70 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చే పెంక్షన్ ఒక్కసారిగా ఆగిపోయింది ఏడూ నెలలు గడుస్తున్నా వృధాభ్య పెంక్షన్ రావడంలేదు ఓపక్క పంచాయితీ వారు పట్టించుకోక, మరోపక్క ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ నడుచుకుంటూ తిరుగుతున్న వృద్ధుల బాధ, ఎక్కడికి వెళ్లినా ఒకే సమాధానం నువ్వు చనిపోయావు అందుకే పెన్స్షన్ ఆగింది అంటూ సమాధానం. బ్రతికి వున్నా వాళ్ళను సైతం చంపేస్తున్నా అధికారులు. నిర్లక్యానికి ఇదో ఉదాహరణ. కనీసం విచారణ లేకుండా బ్రతికి ఉన్న మనుషులను ఏవిధంగా ఏ ఆధారం లేకుండా ఎలా చనిపోయినట్లు నిర్ధారిస్తున్నారో కూడా అధికారుల పనితీరు అద్దం పడుతోంది. *అశ్వారావుపేట ఎంపీపీ* :-   వివరణ ఇప్పటివరకు నా దృష్టికి ఈవిషయం  రాకపోవడం వల్ల నేను ఏవిధమైన చర్య తీసుకోలేదు తప్పకుండా పెంక్షన్ ఎందుకు రావడంలేదో చూసి చర్యలు తీసుకుంటాము. *అశ్వారావుపేట పంచాయితీ వారి వివరణ* :- ఎంపీడీపీ ఆఫీస్ కి వెళ్ళి కలవండి మాచేతుల్లో ఏమీలేదు ఎంతవరకు మేము ఎంపీడీఓ ఆఫీస్ దృష్టికి తీసుకు వెళ్లడం మాత్రమే మా పని.

*ఎంపీడీఓ కార్యాలయం లో సిబ్బంది వివరణ* :- మేము ఆన్లైన్ చేసాము మా తప్పేమీ లేదు మళ్ళీ వెళ్ళి అశ్వారావుపేట పంచాయితీ ఈఓ ని కలవండి. 

ఇదే తంతుగా ఎవరికి వారు సమాధానం చెప్తున్నారు తప్ప పనిమాత్రం ఏవిదంగానైన ముందుకు సాగడం లేదు తిరిగి తిరిగి ఆరోగ్యం కూడా పాడవుతుంది అని వృద్ధురాలు తెలియజేసారు.

Share it:

Post A Comment: