CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి ప్రారంభించారు.అనంతరం కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు ఆషాడపు దేవేందర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలనే వాడాలని ఇవి నిమజ్జనం చేసే కొన్ని గంటల్లోనే కరిగిపోతాయని అదేవిధంగా పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేసిన కొన్ని నెలల అయిన కరగవు అని వాటి తయారీకి వాడిన కెమికల్ నీటితో కలుషితమై జలరాసులు అన్నీ చనిపోయే ప్రమాదం ఉందని అన్నారు.వాతావరణం కూడా కలుషితమై  మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని అంతేకాకుండా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడటం వలన అవి మట్టిలో కలిసినప్పుడు భూసారం దెబ్బతినే అవకాశం ఉన్నదని అన్నారు.రాబోయే వినాయకచవితి వరకు జిల్లా మొత్తం ప్రభుత్వ సహకారంతో పెద్ద మట్టి విగ్రహాలను అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చేల్పురి రాజ్ కుమార్,గౌరవ అధ్యక్షులు ధర్మారావు,మండల అధ్యక్షులు సరిగొప్పుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రవికుమార్, మట్టి విగ్రహాల తయారీ దారులు చేల్పూరి శంకర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: