CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ గిరిజన గ్రామ సమస్యల పై వినతి పత్రం..

Share it:

 



👉 డబుల్ బెడ్ రూం ఇండ్ల కు కరెంట్ మీటర్ల ను ఏర్పాటు చేయాలని, గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని వినతి..


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబరు 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిదిలోని ఎలకలోడ్డు ఆదివాసి గిరిజన గ్రామ సమస్యల పై సిపిఐ ఎంల్ న్యూ డెమోక్రసి మండల కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం లో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజెశారు. ఈ సందర్బంగా న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు మాట్లాడుతూ.. ఎలుకలొడ్డు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కు కరెంట్ మీటర్ల ను ఏర్పాటు చేయకుండా ఇండ్లను ప్రారంబించారని అన్నారు. అదికారులకు, కాంట్రాక్టర్ కు గ్రామస్తులు మీటర్లు ఏర్పాటు చేయ్యమని, మౌఖికంగా చెప్పినా పట్టించు కోక పోవడం దుర్మార్గమన్నారు. అదే విదంగా గ్రామంలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. సిసి రోడ్లు నిర్మించలేదన్నారు. వర్షాకాలం కావడంతో అంతర్గత రహదార్లు బురదమయంగా మారి నడవటానికి ఇబ్బందికరంగా మారిందని, ఎలకలోడ్డు గ్రామంలో నిరుపేద గిరిజనులు వర్షాకాలం ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని, సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామం లొ అంతర్గత సి సి రహదార్లు నిర్మించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ ఉమ్మర్, గోపాలరావు, బచ్చల లక్ష్మయ్య, కందగట్ల సురేందర్, గలిగ వెంకటేశ్వర్లు, మడి సీతారాములు, బచ్చల గోపయ్య, నర్సమ్మ, బోర్రా శ్రీను, కుంజా రమేష్, పర్షక గోపయ్య, గలిగ శాంతిరాజు, పాయం లచ్చినర్సు, గలిగ రాంబాయి, వెంకటరమణ, జబ్బా కోటేశ్వరరావు, భధ్రమ్మ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: