CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలల ను పరిశీలించిన ఎంపీపీ

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: గత 16 నెలలుగా కరోనా కారణంగా మూత పడిన పాఠశాలలు బుధవారం రోజు తెరవడం జరిగింది. అశ్వారావుపేట లోని రింగ్ రోడ్ సెంటర్ లో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను, అలాగే బాలికల పాఠశాలను, సూర్య పాఠశాలను బుదవారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి పరిశీలించారు. అక్కడ వున్న విద్యార్థులను ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగె కరోనా పట్ల జాగ్రత్తగా వుండాలి అని తగు జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగె నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆయన తెలిపారు. అలాగే పాఠశాలలు శుభ్రతను పరిశీలించారు, పాఠశాలలు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలని పాఠశాల యాజమాన్యం నీ కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిద్ధాంతపు ప్రభకరా చార్యులు, ప్రభుత్వ పాటశాల ప్రిన్సిపల్ రాంబాబు, విధ్యకమిటి చైర్మన్ దివ్వెల ప్రసాద్, లేడీస్ స్కూల్ ప్రిన్సిపల్ అమృత కుమారి, సూర్య స్కూల్ ప్రిన్సిపల్ రాంబాబు, ఆయనతో పాటు ఆయా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: