CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీఆర్ఎస్లో హీట్ పుట్టిస్తున్న' తాటి' వ్యాఖ్యలు.. నిజమెంతా..?

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:రాష్ట్ర రాజకీయం అంత ఒకలా ఉంటే అశ్వారావుపేట నియోజకవర్గంలో రాజకీయం మరోలా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ఒకానొక ముఖద్వారమైన ఈ నియోజకవర్గ శాసనసభ స్థానం టీఆర్ఎస్ పార్టీకి అందని ద్రాక్షగా మారింది. ఇందుకు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ ఎస్ పార్టీలోని వర్గ పోరే ప్రధాన కారణమని సొంత పార్టీలోని నాయకులే పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అన్నపురెడ్డిపల్లి మండలంలో జరిగిన టీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమం సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేసిన ఘాటు వ్యాఖ్యలు, నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బలంగానే ఉన్నప్పటికీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అంత బలం లేదని తెలుస్తోంది. ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీయే అంటున్నారు కానీ, గ్రౌండ్ లెవల్లో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంత సమిష్టిగా పని చేయడం లేదన్నారు. టీఆర్ ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని, మళ్ళీ వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఆ గతి పట్టకుండా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని పార్టీ జిల్లా నాయకులతో మాట్లాడి పార్టీ కోసం సమిష్టిగా పని చేసేటట్లు చూడాలని మాజీ ఎమ్మెల్యే తాటి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న ఆరు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఉమ్మడి జిల్లాలోని గిరిజనులకు కేటాయించాలని అన్నారు. ఇప్పటివరకు గిరిజనులకు కేవలం ఒక్క పదవినే కేటాయించిందని, వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని గుర్తు చేశారు. కాబట్టి త్వరలో జరగనున్న నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో గిరిజనుడికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అయితే వ్యక్తిగత అభిప్రాయమని తాటి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మెచ్చా పార్టీలో చేరిన తర్వాత తాటికి ప్రాధాన్యత తగ్గిందని, తాజా మాజీలు పైకి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల ఆధిపత్య పోరు సాగుతోందని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెచ్చా టీఆర్ఎస్ లో చేరక ముందు అన్ని తానై వ్యవహరించిన తాటి, ఇవాల్టి రోజున కార్యక్రమాలకు హాజరు కావడానికి ఇబ్బంది పడుతున్నారని పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే తాటి వర్గీయులు మాత్రం పార్టీ పట్ల ఉన్న బాధ్యత, గిరిజనాభివృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో పట్టిన దుస్థితి రిపీట్ అవుతుందని ముందే గ్రహించిన తాటి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా..? లేదా ఎమ్మెల్సీ పదవి కోసం తాటి ఆశపడుతున్నారా..? అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆలోచనలో పడ్డారు.

Share it:

Post A Comment: