CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విది ఎక్కి రించింది.! ప్రకృతి పగబట్టింది.? కట్టుకున్నది కాలం చేసింది..!

Share it:

 


👉 దివ్యాంగుని దీన గాధ..


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య జబ్బర్ అనే దివ్యాంగుని దీన గాధ.. నిరుపేద కుటుంబంలో పుట్టి కూలి పనులు చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్న క్రమంలో హఠాత్తుగా పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి చలనం లేకుండా పడిపోయి తన పేదరికాన్ని విది ఎక్కిరించింది. ఈ పరిస్థితుల్లో సగ భాగమైన కట్టుకొన్న భార్య అనారోగ్యంతో కాలం చేసింది. కన్న కొడుకు తండ్రిని వదిలి మత్తుతో ముక్తి పొందుతున్నాడు. ఇదిలా ఉండగా ప్రకృతి పగబట్టినట్టు అకాల వర్షాలతో తనకున్న చిన్న గూడును నీళ్ళతో నింపి ఎక్కిరిస్తోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళు చేరాయి. వండుకో లేక గ్రామంలో అన్నం అడుక్కొని తింటున్నాడు. ఈ పరిస్థితిలో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, దాతలు ముందుకొచ్చి దివ్యాంగుని ఇంటిని నీరు చుట్టుముట్టకుండా చర్యలు చేపట్టాలని, మట్టి తొలించి శాశ్విత పరిష్కారం చూపాలని మన్యం టీవీ ద్వారా ప్రాధేయ పడుతున్నాడు. 

సంఘం నాగరాజు 

మన్యం టీవీ ప్రతినిధి జూలూరుపాడు

Share it:

Post A Comment: