CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాబ్జిప్రసాద్ ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు జయంతి సందర్బంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మంగపేట తహసీల్దార్ బాబ్జిప్రసాద్ తెలంగాణ కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో ప్రజల్లో స్వరాష్ట్రకాంక్షను రగిలించిన ప్రజకవి, తెలంగాణ యాస, తెలంగాణ భాష కోసం గోస కోసం గొడవ పడిన వ్యక్తి అటువంటి మహనీయుని పుట్టిన రోజును తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ యావత్తు కాళోజి వేడుకలు చేసుకోవటం మనం కాళోజి నారాయణ రావు కు ఇచ్చే అత్యున్నత గౌరవం అని తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ కాళోజి గురించి అతని సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: