CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బానోత్ ధర్మ నాయక్...

Share it:

 



మన్యం టీవీ :  జూలూరుపాడు, సెప్టెంబర్ 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోత్ ధర్మ నాయక్ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పడమట నర్సాపురంలో రైతు వేదిక ప్రారంభోత్సవ  కార్యక్రమంలో పాల్గొనడానికి తన ద్విచక్రవాహనంపై వచ్చి మంత్రి పువ్వాడ జూలూరుపాడు వస్తున్నారన్న సమాచారంతో వెళ్తుండగా నర్సాపురంలోని సేవాలాల్ గుడి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాములు నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, అత్యవసర వైద్య ఖర్చులకు పదివేల రూపాయలను అందజేసి 108 వాహనంలో కొత్తగూడెం హాస్పటల్ కు తరలించారు. ప్రారంభోత్సవ అనంతరం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు ధర్మా నాయక్ ను పరామర్శించారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడని, హాస్పటల్ నుండి ఇంటికి తీసుకొచ్చామని, తగిలిన గాయాలకు 10 కుట్లు పడినట్లుగా మన్యం టీవీకి తెలిపారు.

Share it:

Post A Comment: