మన్యం టీవీ ఏటూరు నాగారం
మండలంలోని చల్పాక గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను పార్టీ మండల అధ్యక్షుడు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ చల్పాక గ్రామ కమిటీ అధ్యక్షునిగా బొడ శంకర్,ప్రధాన కార్యదర్శిగా వట్టం సత్యనారాయణ, ఎస్టీసెల్ అధ్యక్షునిగా ఆలం మధు,రాజబాబు మహిళా కమిటీ అధ్యక్షులుగా పీరీల సబితా,అనిత లు ఎన్నికైనట్లు తెలిపారు.*టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఆర్థిక సహాయం* ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త కర్నే సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.4500/రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి వాలియబీ సలీం,చల్పాక ఎంపీటీసీ కోట నరసింహులు, సబ్సిడీ రామ నరసయ్య, తాడూరి రఘు అంతటి నాగరాజు సయ్యద్ సర్దార్ పాషా,ఎండి ఖాజా పాషా, బెడిక రమేష్, కుమ్మరి చంద్రబాబు,తాళ్లపల్లి మోహన్, గండేపల్లి నరసయ్య,తాండ్ర సతీష్,బాసాని శేఖర్, వెంకటేశ్వర్లు,రవి,వెంకన్న, ఆంజనేయులు,వెంకటేష్, సత్యం,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: