CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కొత్తగూడెం ఏరియా లో సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు రెండవ విడత మెగా వ్యాక్షినేషన్ కార్యక్రమం.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) సింగరేణి లో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి మరియు కుటుంబ సభ్యులకు వ్యాక్సినేసన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు కొత్తగూడెం ఏరియా పరిధిలో పనిచేసే ఉద్యోగులందరికి, కాంట్రాక్టు కార్మికులకు మరియు ఉద్యోగులకు  రుద్రంపూర్ డిస్పెంసరి, రామవరం కమ్మ్యునీటి హాల్ మరియు సత్తుపల్లి దిస్పెంసరి 3 సెంటర్ల నందు నిర్వహించే రెండవ డోసు మేగా వ్యాక్సినేసన్ కార్యక్రమానికి  ముఖ్య అతిదీ గా సింగరేణి డైరక్టర్ ఫైనాన్స్ & (పా) ఎన్.బలరామ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సంధార్భముగా సింగరేణి డైరక్టర్ ఫైనాన్స్ & (పా) ఎన్.బలరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగికి వ్యాక్షినేషన్ ఇవ్వలానే సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఆదివారం నాడు  18 సంవత్సరములు నిండిన ఉద్యోగులకు జూన్ నెల 13.06.2021 నుండి మొదటి డోసు కోవి షీల్డ్ వ్యాక్షీన్  తీసుకుని 84 రోజులు అయిన  సింగరేణి ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మొదటి మరియు రెండవ డోసు  వ్యాక్షినేషన్ ఇవ్వబడటం జరుగుతుంది అని ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని కోవిడ్ సోకాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఉద్యోగులు ఆరోగ్యముగా ఉంటేనే సంస్థకు రక్షణతో కూడిన ఉత్పత్తి లాభాలు వస్తాయని అన్నారు. అదే విధముగా రుద్రంపూర్ దిస్పెంసరి నందు నూతనముగా ఏర్పాటు చేసిన రక్త పరీక్షా కేంధ్రం ఫిజియోథెరపీ ల్యాబ్ ను సందర్శించి ఈ ల్యాబ్ ఏర్పాటు చేయటానికి కృషి చేసిన అధికారులను, యూనియన్ నాయకులకు మరియు సంబంధిత ఉద్యోగులను అభినంధించారు. 

అదే విధముగా కొత్తగూడెం ఏరియా జి‌ఎం సి‌హెచ్.నరసింహారావు మాట్లాడుతూ ఈ రోజు రుద్రంపూర్ డిస్పెంసరి, రామవరం కమ్మ్యునీటి హాల్, సత్తుపల్లి దిస్పెంసరి,నందు ఈ యొక్కకోవి షీల్డ్ వ్యాక్షీన్ రెండవ డోసు మెగా వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సెప్టెంబర్ 20 వరకు నిర్వహించే ఈ యొక్క మెగా వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యక్షినేషన్ వేసుకున్న తరువాత కూడా విధిగా మాస్క్ మరియు బౌతీక దూరం పాటిస్తూ కోవిడ్ బారిన కుండా ఉండాలని కోరారు.ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆదివారం నాడు  రుద్రంపూర్ డిస్పెంసరి నందు 140, రామవరం కమ్మ్యునీటి హాల్ నందు 88, సత్తుపల్లి దిస్పెంసరి నందు 101, మొత్తం 329 మంది కార్మికులు వారి కుటుంబాలకు వ్యాక్షినేషన్  ఇచ్చామని తెలిపారు. 

ఈ కార్యక్రమములో సింగరేణి డైరక్టర్ ఫైనాన్స్ & (పా) ఎన్.బలరామ్ ,కొత్తగూడెం ఏరియా జి‌ఎం సి‌హెచ్.నరసింహా రావు, జి‌ఎం (పర్సనల్) వెల్ఫేర్ & సి‌ఎస్‌ఆర్ బసవయ్య, జి‌ఎం (పర్సనల్) ఆర్‌సి, ఐ‌ఆర్ & పి‌ఆర్ ఏ.ఆనంద రావు, కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్, డి‌జి‌ఎం పర్సనల్ ధనపాల్ శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కోటి రెడ్డి, డాక్టర్ పరశు రామ్, డాక్టర్ శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్స్ డి.కిరణ్ బాబు, జి.బుచ్చయ్య, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణా రెడ్డి, సీనియర్ పీవోలు బేతి రాజు, శ్రావణ్ కుమార్, హషీమ్ పాషా, సుధాకర్, 11 మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, ఇతర అధికారులు, స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సంగాల పద్మా రావు, సేవా కొ ఆర్డినేటర్ సాగర్, పిట్ సెక్రటరీలు, టి‌బి‌జి‌కే‌ఎస్ యూనియన్ నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: