CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన బాలిక చైత్ర బాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి...

Share it:

 



 👉 బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందజేయాలి..


👉 గిరిజన సంఘం జిల్లా నాయకులు భూక్య దేవి లాల్ నాయక్ డిమాండ్..



మన్యం టీవీ :  జూలూరుపాడు, సెప్టెంబర్ 12, హైదరాబాద్ సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని గిరిజన బాలిక చైత్ర బాయి (6) పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఉరితీయాలని, గిరిజన సంఘం జిల్లా నాయకులు దేవిలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చైత్ర బాయి కుటుంబానికి తక్షణ సహాయం అందించి న్యాయం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మానవ మృగాలు పసి పిల్లలపై అత్యాచారాలు చేస్తున్నా  ప్రభుత్వ అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండటం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అంత పెద్ద హైదరాబాద్ మహ నగరంలో గిరిజన ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని, మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ప్రభుత్వం ఏ  విధంగా రక్షణ కల్పిపిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో గిరిజనులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబానికి ఒక ఉద్యోగం, మరియు 50 లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share it:

Post A Comment: