CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

5 కోట్ల రూ"లతో పాల్వంచ కే.యస్.పి రోడ్డు విస్తీర్ణ పనులు మంజూరు......

Share it:మన్యం టీవీ పాల్వంచ:-


పాల్వంచ పట్టణంలో కిన్నెరసాని రోడ్ ను అభివృద్ధి పరచడానికి 5 కోట్ల రూ"లు మంజూరు అయ్యాయని *కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు* అన్నారు. సోమవారం పట్టణంలో కే.యస్.పి రోడ్ లో అంబేద్కర్ సెంటర్ నుండి అల్లూరి సెంటర్ వరకు పాదయాత్ర చేసి విస్తరణ పనుల గురించి అధికారులతో పరిశీలించారు. రోడ్డు భవనాల శాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో పట్టణాభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో *వనమా* మాట్లాడుతూ కే.యస్.పి రోడ్డు ను ఇరువైపులా విస్తరించి, సెంటర్ డివైడర్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నామన్నారు.రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంబాలను రోడ్డు కి ఇరుపైపులా ఏర్పాటు చేస్తామన్నారు.పాల్వంచ పట్టనాన్ని సుందరంగా తీర్చి దిద్దటమే తన ద్యేయం అన్నారు.

ఈ కార్యక్రమంలో *డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు,ఎలక్ట్రికల్ యస్.ఈ సురేందర్, డి.ఈ విజయ్, మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్, డి.ఈ మురళీ, ఆర్ &బి డి.ఈ నాగేశ్వరరావు, ఏ.ఈ వంశీ, మిషన్ భగీరాధ డి.ఈ నవీన్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాష్ రావు, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజ్మీరా రమేష్, తెరాస మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, యస్.వి.ఆర్కె ఆచార్యులు, వై రమణమూర్తి నాయుడు, చింతా నాగరాజు, బేతంశెట్టి విజయ్, హర్షవర్ధన్, మల్లేష్ నాయుడు,సిరాజ్, కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: