CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల పోలీస్ స్టేషన్ లో 52 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు

Share it:

 



మన్యం టీవీ చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో లో 52 మంది మావోయిస్టులు సానుభూతిపరులు ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగి పోయారు. చర్ల మండలం లోని అటవీ ప్రాంత గ్రామాలు అయినా బట్టిగూడెం, చెన్నాపురం, బత్తిని పల్లి, పుసుగుప్ప గ్రామాలకు సంబంధించిన మావోయిస్టు అనుబంధ మిలిషియా, మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులు, సానుభూతిపరులు లోంగి పోయిన వారిలో ఉన్నారని, వీరిలో  ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు ఎస్వి తెలపడం జరిగింది. వీరంతా మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో ఏడాదికాలంగా పని చేస్తున్నట్లు తెలిపారు. చతిస్గడ్ లోని దట్టమైన అడవి ప్రాంతం అయినా పసర్లపాడు, పుట్ట పాడు ప్రాంతాలలో మావోయిస్టు వీరికి శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. గత కొంత కాలంగా చర్ల పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం మరియు చత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం లో ఉన్న గ్రామాలలో సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్, లోకల్ పోలీసులు చేస్తున్న కుబింగ్ ఫలితంగా మరియు సాయుధ ఉద్యమం పేరుతో మావోయిస్టు వేధింపులు భరించలేక వీరందరూ లొంగిపోయినట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. 

Share it:

Post A Comment: