CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 36 వ వర్ధంతి వేడుకలు

Share it:

 


*పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ పోరాటం తన తేగువను చాటిన చాకలి ఐలమ్మ 36 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

ఆనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ 

అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి.తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి,దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. ఈ భూమినాది,పండించిన పంటనాది,తీసుకెళ్లడానికి దొరెవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట,భూమి మీరు దక్కించుకోగలరు.అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, మశ్చ శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,

ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,

మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండీ షకీల్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,గుంటోజు శంకరయ్య,

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,

మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి హైమద్,పోలు రవి,ఎండీ ముకుద్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: