CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు ఓసి 2 శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నేటి నుండి ఐదు రోజుల పాటు శ్రీ పంచాయతన సహిత చండీ యాగం

Share it:

 కార్మికుల క్షేమం,లోక కళ్యాణార్థం చండీ యాగం ఆలయ కమిటీ చైర్మన్ దండమూడి రాంబాబు


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ప్రకాశం ఖని, ఉపరితల గని ఓసి-2 లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏరియా జిఎం జక్కం.రమేష్ ప్రోత్సాహంతో కార్మికుల,అధికారుల,సూపర్వైజర్ల,ఉద్యోగుల కార్మిక సంఘాల సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీ పంచాయతన సహిత చండీ యాగం మహోత్సవం నేటి నుండి ప్రారంభమైంది. శుక్రవారం తొలి రోజు సుప్రభాతం నిత్య పూజ, మంగళ తోరణ బంధనం, గణపతి పూజ, పుణ్యాహవాచనం,దీక్ష ధారణ,శాల ప్రవేశం,అఖండ స్థాపన,అవగాహన ఆరాధన,అంకురారోపణ పూజ తీర్థ ప్రసాద, వినియోగం,అగ్నిప్రతిష్టాపన ,గణపతి హోమం, ప్రదోషకాల మంటప పూజలు,కుంకుమార్చన,నీరాజన మంత్ర పుష్ప దర్బారు సేవ,తీర్థ ప్రసాద వినియోగం తదితర పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ కొండవేటి.బాల దత్తాత్రేయ శర్మ,వారి బృందం ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ దండమూడి. రాంబాబు కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవగ్రహ దోషాలు తొలగిపోవాలని, అమ్మ వారి ఆశీస్సులతో ఓసి-2 ఉద్యోగులు,కార్మికులు అధికారులు,కార్మిక సంఘాల నాయకులు,అందరూ క్షేమంగా ఉండాలని,రక్షణతో కూడిన ఉత్పత్తికి అమ్మవారి చల్లని చూపు కటాక్షించాలని అందరూ సంతోషంగా జీవించాలని,పరిసర ప్రాంత ప్రజలు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలని,పాడి పంటలు, లోక కల్యాణార్థం,చండీ యాగం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.యాగం చివరి రోజు అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఓసి-2 ఆవరణలోనే అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని,సింగరేణి కార్మికులు,వారి కుటుంబ సభ్యులు,సమీప ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లోక కల్యాణార్థం నిర్వహించే చండీ యాగం లో పాల్గొని,అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.యాగంలో పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి. లక్ష్మీపతి గౌడ్,ప్రాజెక్ట్ మేనేజర్ మాలోతు.రాముడు లీల దంపతులు,ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరభద్రుడు, ఆలయ కమిటీ చైర్మన్ ఓసి- 2 మేనేజర్ దండమూడి రాంబాబు,గుర్తింపు సంఘం నాయకులు వి.ప్రభాకర్ రావు,ఓసి-4 మేనేజర్ దేవసాని శ్రీనివాసరావు, నాయకులు కోట. శ్రీనివాసరావు,సిహెచ్.అశోక్,పికే ఓసి రక్షణాధికారి ఎం. లింగబాబు,అధికారులు కళ్యాణ్ రామ్,అప్పారావు, ఎస్ ఈ శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,సీనియర్ పి ఓ ఎండి.మదార్ సాహెబ్, సంక్షేమ అధికారి ఠాకూర్, మోహన్ సింగ్ మరియు పలు కార్మిక సంఘాల నాయకులు,వై.రాంగోపాల్ వేలగపల్లి.జాన్,వి.వెంకటరత్నం,వీరమని.రవీందర్రావు,బి.కుమార్,ఎస్డి.నాసర్ 

పాషా,పెద్ద ఎత్తున కార్మికులు,వారి కుటుంబ సభ్యులు,భక్తులు చండియాగాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు.చండీ యాగానికి ప్రత్యేక యాగశాలను అందంగా అలంకరించడం తో పాటు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.నిత్యం భారీ యంత్రాల,రణ గోణ ధ్వనులతో మారుమ్రోగే ఓసి-2 ప్రాంగణం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో,పచ్చని తోరణాల అలంకరణలతో సుగంధ సువాసనలతో, ఆధ్యాత్మికత శోభ చోటు చేసుకుంది.మాజీ కార్మికులు డీ జి కె మూర్తి,వూటుకూరు. సత్యనారాయణ,మల్లికార్జున చారి లు చండీ యాగ సేవలో పాల్గొనడం విశేషం, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎన్ సి. పవన్ కుమార్,కె. సత్యనారాయణ,లింగయ్య, హనుమంతు,సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: