CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా 12 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(సెప్టెంబర్-16)::అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట గ్రామంలో రైతు వేదిక నందు పోషకాహార మహోత్సవాల సందర్భంగా ఐ సి డి ఎస్ చండ్రుగొండ ప్రాజెక్ట్ మీటింగ్ నిర్వహించారు. ప్రాజెక్ట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహిళా,శిశు సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారిణి ఆర్ వరలక్ష్మి విచ్చేశారు. పోషణ మాస సందర్భంగా 12 మంది బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి , వారు తీసుకోవాల్సిన పోషకాహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి పలు సూచనలు, సలహాలను తెలియజేశారు. ఆర్ వరలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అందరూ పోషణ మాసంలో పిల్లలు ఎత్తు, బరువు, జబ్బా చుట్టూ చుట్టుకొలత సక్రమంగా కొలిచి, పోషణ ట్రాకర్ ను ఆన్లైన్ చేయాలని, పిల్లల పోషణ స్థితి అంచనా వేయాలని,అంగన్వాడి సెంటర్ లు సమయం ప్రకారం నడుపుతూ పిల్లలకు మంచి పోషణ అందించాలని, ప్రస్తుతం జరుగుతున్న కొవీడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలని ఆదేశించారు.సి డి పి ఓ నిర్మల జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు అందరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాజెక్టు కు మంచి పేరు తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ గంగాజలం, పోషణ అభియాన్ రాజ్యలక్ష్మి, రామబ్రహ్మం, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: