CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్టోబర్ 1న పోడు రైతుల సదస్సును విజయవంతం చేయండి!!

Share it:

 


 సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు 

మన్యం టీవి, అశ్వాపురం:

పోడు వ్యవసాయసాగుదారులందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టా హక్కు కల్పించాలని ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని పోడు సాగు దారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని అక్టోబర్ 1న బయ్యారం క్రాస్ రోడ్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ స్థాయి పోడు రైతుల సదస్సును విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు

 ఎస్ కె ఉమర్, మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి పిలుపునిచ్చారు బుధవారం అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోమూతి సైదులు అధ్యక్షతన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏజెన్సీలోని పోడు సాగు దారులపై హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులు , పోలీసులతో దాడులు చేసి పోడు భూముల అక్రమ ఆక్రమణకు పాల్పడుతూ ప్రజల ఉసురు తీస్తుందని అన్నారు.

 పోడు రైతుల భూముల్లో పంటలను ధ్వంసం చేసి ఫారెస్ట్ అధికారులు పోలీసులు వారిపై దాడికి పాల్పడడంతో ఇద్దరు రైతులు పురుగుల మందు సేవించి ఇటీవల ఆత్మహత్య యత్నం చేశారని తెలిపారు. గతంలో కూడా జిల్లాలో పోడు రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్మి ఓటు వేసి గెలిపిస్తే పోడుభూమి సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన పోడు సాగుదారులకు భంగపాటు ఎదురైందని , ఎన్నికల అనంతరం వార్డ్ నెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మొరపెట్టుకున్నా పోడు భూముల సమస్య గురించి పట్టించుకున్న నాథుడేలేడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించుకుంటే తమ బతుకులు బాగుపడతాయన్న ప్రజల నమ్మకం వమ్మయిందని అన్నారు. తెలంగాణ వస్తే ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగదని చెప్పిన కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రంలో ఉద్యమ నుండి వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి లక్షల మంది జీవన్మరణ సమస్యగా ఉన్న పోడు భూమి సమస్య పై ఇంత వరకూ నోరు మెదపకపోవడం ఆక్షేపణీయం అన్నారు. పాలకులే ప్రజల సమస్యలపై స్పందించనప్పుడు , అధికార బలంతో పోడు భూములు బలవంతంగా దాడులు చేసి గుంజు కుంటున్నప్పుడు , కూటికి లేని అభాగ్యులు ఏం చేయాలో పాలకులు సెలవిస్తారా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ మొత్తం పోడు భూముల సమస్య గురించి అట్టుడికిపోతుంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు గా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలని వేల కుటుంబాలు పోడు భూముల పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఆంధ్ర పాలకుల కంటే నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం పోడు సాగు దారులపై ఫారెస్ట్ పోలీస్ అధికారుల దాడులను ఆపాలని పోడు సాగు దారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అక్టోబర్ 1న పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరగనున్న పినపాక నియోజకవర్గ స్థాయి పోడు రైతుల సదస్సును విజయవంతం చేయాలని పోడు సాగుదారుల కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మూతి మహాలక్ష్మి మూతి లింగయ్య సోయం వెంకన్న తెల్లం రాజమ్మ మూతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: