CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు O C 2 లో జరిగినటువంటి ప్రమాదానికి సింగరేణి రక్షణ చర్యలు పర్యవేక్షణ లో విపలం

Share it:

 


B M Sవెజ్ బోర్డు సభ్యులు మాధవ నాయక్   

మన్యం మనుగడ, మణుగూరు:

   మణుగూరు ఏరియా O C 2 లో జరిగిన ప్రమాదం తెలుసుకొని హుటాహుటీన బూపాలపల్లి పర్యటనను అర్దంతరంగా ముగించుకొని మణుగూరు ఏరియా హాస్పిటల్లోని భౌతిక కాయాలను సందర్శించి నివాళులు అర్పించారు.

   అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి దైర్యాన్ని చెప్పి, మాట్లాడుతూ 

  మణుగూరు O C 2 లో జరిగినటువంటి ప్రమాదానికి సింగరేణి రక్షణ చర్యలు పర్యవేక్షణ లో విపులం చెందింది అని వెజ్ బోర్డు సభ్యులు శ్రీ మాధవ నాయక్ గారు B M S వెల్లడించారు...

  సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి ఉత్పాదకత పై వున్న శ్రద్ధ కార్మికుల ప్రాణాల రక్షణ చర్యలపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

    రక్షణ చర్యలపై కార్మికులకు అవగాహన కల్పించడం లోను, రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయడం లోను రక్షణ లో D G M S సూచనలను తుంగలో తొక్కటము వలన ఈలాంటి దుర్గటణలు తరుచుగా జరిగినా సింగరేణి యాజమాన్యం మొద్దు నిద్రను వీడటంలేదు అని పేర్కొన్నారు. ధేశములో సింగరేణి బొగ్గు ఉత్పత్తి లో 10 శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది కాని ప్రమాదాల మరణాల్లో మాత్రం 50 శాతాన్ని మించి టం ఇది రక్షణ చర్యల వైపల్ని సూచిస్తుంది.

  యాజమాన్యాం ఈసంఘటన పై సమగ్రమైన విచారణ జరిపించి బాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...

   మృతుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి మరియు వారి కుటుంబ సభ్యులలో ఒకరికి షూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని B M S డిమాండ్ చేస్తున్నారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు శ్రీ వీరమనేని రవీందర్ రావు, శ్రీ భూక్యా కిషన్ ఏరియా ఉపాధ్యక్షుడు, బ్రాంచి నాయకులు T P V శివ రావు, మల్లికార్జున్ ప్రదీప్ అనుదీప్ పర్స నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: